సీఎం జగన పాలనపై బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. 5ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని దుయ్యబట్టారు. దీంతో రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి మీద రూ.2 లక్షల భారం పడిందని మండిపడ్డారు. రాష్ట్ర సచివాలయం, గనులను తాకట్టు పెట్టేందుకు సీఎం జగన్ రెడీ అవుతున్నారని ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో నాణ్యత లేని మద్యం తాగి ఎందరో అనారోగ్యం పాలయ్యారని ఫైర్ అయ్యారు.