ఏప్రిల్ 8న ఏర్పడే సంపూర్ణ సూర్య గ్రహణం.. ఉత్తర అమెరికా, కెనడా ప్రాంతాల్లో ఎక్కువగా ప్రభావం చూపనుంది. ఈ తరుణంలో న్యూయార్క్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడున్న జైళ్లలో 20కి పైగా కేంద్రాలకు తాళం వేయాలని ప్రకటించింది. దీంతో వివిధ మతాలకు చెందిన పలువురు ఖైదీలు కోర్టును ఆశ్రయించారు. మతవిశ్వాసాలు పాటించకుండా నిరోధించడంతోపాటు, రాజ్యాంగహక్కును ఉల్లంఘించడమే అవుతుందని మండిపడ్డారు.