ప్రేమ పెళ్లిని పెద్దలు అంగీ కరించరన్న ఉద్దేశంతో ఓప్రేమజంట గురువారం ఉయ్యూరు పోలీసులను ఆశ్రయించింది. ఉయ్యూరు పట్టణ సీఐ హబీబ్‌బాషా తెలిపిన వివరాల ప్రకారం..స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన యువకుడు, కలువపాములకు చెం దిన యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ గురువారం ఓ దేవాలయంలో వివాహం చేసుకుని పెద్దలు అంగీకరించరన్న భయంతో పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఇద్దరూ మేజర్లు కావడంతో వారి కుటుంబసభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ చేసినట్టు సీఐ హబీబ్ బాషా, ఎస్సై గణేశ్‌కుమార్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa