శ్రీ సత్య సాయి జిల్లా అగలి మండల కేంద్రంలో శనివారం టిడిపి ఎన్నికల ప్రచారాన్ని నాయకులు కార్యకర్తలు నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ పాల్గొని ఇంటింటికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రవేశపెట్టే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.