ఎన్నికల వేళ నిత్యం అప్రమత్తంగా ఉండాలని అనంతపురం డీఎస్పీ జి. వీరరాఘవరెడ్డి సూచించారు. అనంతపురం నగరంలో వార్డుల(డివిజన్ల) వారీగా కేటాయించిన పోలీసు సిబ్బందితో ఆయన శుక్రవారం జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు స్థానిక సబ్ డివిజన్ పోలీసు కార్యాలయంలో సమావేశమయ్యారు. కేటాయించిన డివిజన్లలో నిత్యం నిఘా ఉంచాలన్నారు. ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి ఆయా సి. ఐ ల దృష్టికి తీసుకురావాలన్నారు. సమస్యలు, గొడవలు తలెత్తే అవకాశమున్న ప్రాంతాలను గుర్తించి తెలియజేయాలన్నారు. పారదర్శక, నిష్పాక్షిక మరియు స్వేచ్ఛాయుత ఎన్నికలే లక్ష్యంగా పని చేద్దామని పిలుపునిచ్చారు.