టీడీపీ నేత వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతి రెడ్డిలకు రాజకీయాలంటే వ్యాపారంగా మారాయని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి విమర్శించారు. సోమవారం వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, నల్లపురెడ్డి రాజేంద్రకుమార్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వి.విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.... ఓడిపోతే పారిపోయే వారు కావాలా? మీతో ఉండే వాళ్లు కావాలా? రాజేంద్ర కుమార్ రెడ్డి, ప్రశాంతిరెడ్డి గారి టెలిఫోన్ సంభాషణ పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. పెద్దల పట్ల అగౌరవంగా మాట్లాడటం, టీడీపీలో చేరిన తర్వాత ప్రశాంతిరెడ్డి, ఆమె భర్త వేమిరెడ్డి కానీ విజయం సాధించలేకపోతే రాజకీయాల్లో నుంచి నిష్క్రమిస్తాం అనేది స్పష్టమవుతోంది. దుబాయ్, సింగపూర్, ఇండోనేషియా, ఆఫ్రికా, ఇండియాల్లో వారి వ్యాపార లావాదేవీలు చూసుకుంటారే కానీ ప్రజాజీవితంలో ఉండరు అనేది ఘంటాపథంగా చెప్పొచ్చు. వారి మనోభావాలనే వారు వ్యక్తపరిచారు. ఇప్పుడు నెల్లూరు ప్రజలే నిర్ణయించుకోవాలి. మీకు మీ సమస్యలను ఆకలింపు చేసుకుని ఎల్లవేళలా మీతో పాటు, మీ కష్టంలో, నష్టంలో కలసి పనిచేసే వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులు కావాలా? లేక మేం పోటీచేస్తాం..ఓడిపోతే మా వ్యాపార లావాదేవీలు చూసుకుంటాం అన్నటువంటి టీడీపీ అభ్యర్థులు కావాలా అనేది నిర్ణయించుకోండి. నెల్లూరు జిల్లా వాసులు మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా. ఎప్పుడూ వైఎస్సార్సీపీ అధినేత జగన్ గారు, మా శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు అనునిత్యం ప్రజాజీవితంలోనే ఉంటాం అని హామీ ఇచ్చారు.