చంద్రబాబులా నేను పొలిటికల్ డాన్సర్‌ను కాదని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. రోజుకో పార్టీతో డాన్స్ చేస్తే వ్యక్తి చంద్రబాబు. పవన్ కల్యాణ్, చంద్రబాబు ఇద్దరూ పొలిటికల్ డాన్సర్లే’ అంటూ మంత్రి సెటైరికల్ కామెంట్స్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు చంద్రబాబు పార్టీలో పోటీ చేసేందుకు నేతలే లేరని ఎద్దేవా చేశారు. మేము వదిలేసిన వ్యక్తులకు టీడీపీలో టికెట్ ఇచ్చి పోటీ చేయిస్తున్నారని సెటైర్లు వేశారు. చంద్రబాబు సభలన్నీ అట్టర్ ఫ్లాప్. సందుల్లో మీటింగ్‌లు పెట్టి జనం రాలేందంటే మీ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే నైతిక అర్హత చంద్రబాబుకు లేదు. ఎక్కడ పదువులు అనుభవించి ఇప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు సిగ్గు, శరం లేదన్నారు.