1919, ఏప్రిల్ 13 భారత దేశ చరిత్రలో బ్రిటిష్ పాలకుల దమనకాండకు పరాకాష్ఠగా, చరిత్ర సాక్ష్యంగా నిలిచిన చీకటి దినం. భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో అత్యంత దురదృష్టమైన, హేయమైన సంఘటన జలియన్ వాలాబాగ్ ఉదంతం. నాటి బ్రిటిష్ పాలకుల చర్యలకు వందలాది మంది అమాయకులు ప్రాణా లు కోల్పోయిన నేపథ్యం. శతాబ్ద కాలం గడిచినా చెరగని నెత్తుటి మరకల జ్ఞాపకం. పంజాబ్, బెంగాల్‌లో నానాటికీ పెచ్చరిల్లుతున్న విప్లవోద్యమం.