ఆప్కోను ఆదుకున్న మనసున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని చేనేత కార్మికులు కొనియాడారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని సీఎం వైయస్ జగన్ చేనేత రంగాన్ని ఆదుకున్నారని చెప్పారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా శనివారం మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్ లో చేనేత కార్మికులతో సీఎం వైయస్ జగన్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు చేనేత కార్మికులు మాట్లాడారు.