అచ్చుతాపురం మండలంలోని తంతడి-ఓడపాలెం మత్స్యకారుల వలలో శుక్రవారం భారీ చేప పడింది. దీనిని వారు ఒడ్డు వరకూ లాగారు. తీరా ఒడ్డుకు చేరాక పరిశీలిస్తే అది తిమింగలంగా గుర్తించారు. ఇది సుమారు 30 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు ఉందని మత్స్యకారులు తెలిపారు. ఈ తిమింగలం కదలకపోవడంతో మత్స్యకారులు తమ వలలను తొలగించి సముద్రంలోకి పంపించే ప్రయత్నాలు చేసినప్పటికీ వెళ్లలేదు. చనిపోయిన తిమింగలం వలలో పడిందని జాలర్లు తెలిపారు.