సీఎం జగన్ కు ఓటింగ్ భయం పట్టుకొని సానుభూతి కోసమే గులకరాయ డ్రామా ఆడుతున్నారని రేపల్లె శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. సోమవారం రేపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం జగన్ ను ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అదపతాలానికి తీసుకువెళ్లాడన్నారు. చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రి చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.