భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ఇండియా కూటమి ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు నీలం నాగేంద్రరావు, దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియన్ పిలుపునిచ్చారు. సోమవారం చీరాలలో వారు మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మారుస్తామంటున్న బీజీపీని ఓడించాలన్నారు. మోడీ ప్రధానిగా వచ్చాక దేశంలో నియంతృత్వం పెరిగిందన్నారు. ఈ పరిస్థితులలో ఇండియా కూటమిని గెలిపించాలన్నారు.