ఒడిశాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జజ్పుర్ జిల్లాలోని హైవే 16పై ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బ్రిడ్జి పై నుంచి కిందపడింది. ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. మరో 40 మందికి గాయాలయ్యాయి. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారికి రూ.3 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.