వివేకా హత్య కేసులో సునీత చెప్పేవన్నీ అబద్దాలేనని, దస్తగిరి వాంగ్మూలాన్ని నిజం చేసే ప్రయత్నం జరుగుతుందని దేవిరెడ్డి శంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి అన్నారు. సీబీఐ వద్ద దస్తగిరి స్టేట్ మెంట్ తప్ప ఏ ఒక్క ఆధారం లేదన్నారు. సునీత దస్తగిరిని అడ్డంపెట్టుకుని ఓ బూటకం ఆడుతుందని మండిపడ్డారు. ఇంటి తలుపులు బద్దలైతే అన్నీ బాగున్నాయని సీబీఐకి చెప్పిందని గుర్తు చేశారు. ఇంటి తలుపులు బద్దలు కొట్టారనేది విడిచిపెట్టి ఇంట్లో వాళ్లే చంపారని సునీత ప్రస్తావిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంపినప్పుడు లెటర్ రాశాడన్నారు, చేతి వేళ్లు నరికితే రక్తపు మరకలు ఉండవా.. అసలు ఎలా రాయగలడు? - దస్తగిరి, రంగన్న చెప్పిన సమాచారం పూర్తి విరుద్ధంగా ఉంది. రెండో భార్య సమీమ్‌కు ఆస్తి గొడవలున్నాయి. ఆస్తి పత్రాలు దొంగిలించాల్సిన అవసరం ఎవరికి ఉంది? దీన్ని కూడా సీబీఐ పట్టుకోలేకపోయింది’ అని చైతన్యరెడ్డి మండిపడ్డారు.