AP: ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో అర్ధరాత్రి 12:45 గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగిందని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. మంటలను గమనించిన ఓ ప్రయాణికుడు చైన్ లాగడంతో రైలు ఎలమంచిలిలో ఆగింది. B1 బోగీలో చంద్రశేఖర్ అనే వ్యక్తి మృతదేహాన్ని గుర్తించామని ఎస్పీ తెలిపారు. ప్రమాద కారణాలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్పీ వెల్లడించారు. కాగా, ఈ ఘటనలో ఒక వ్యక్తి చనిపోయిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa