జమ్మూ కాశ్మీర్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) అధినేత గులాం నబీ ఆజాద్ వెనక్కి తగ్గారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. అనంత్‌నాగ్-రాజౌరీ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆయనను పార్టీ నామినేట్ చేసింది. అయితే గులాం నబీ ఆజాద్ అనూహ్యంగా యూ-టర్న్ తీసుకున్నారు. ఈ మేరకు బుధవారం ప్రకటించారు.