ప్రధాని మోదీతో మాట్లాడే ధైర్యం సీఎం జగన్ కు లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. 'జగన్ కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాడట. రాష్ట్ర విభజన, ప్రత్యేక హోదాపై చర్చ సమయంలో సోనియా గాంధీ ముందు ప్లకార్డు పట్టుకోలేని పిరికివాడివి నువ్వు. అలాంటిది మోదీతో మాట్లాడగలవా?' అని ఫైరయ్యారు. సంపద సృష్టించడం కంటే డబ్బులు పంచడం చాలా సులభం అని పవన్ అన్నారు.