వైసీపీ పార్టీకి పతనం ఖాయమని శింగనమల నియోజ కవర్గం ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ పేర్కొన్నారు. గురువారం సాయం త్రం గార్లదిన్నె మండలం పాతకల్లూరు గ్రామంలో శింగనమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డితో కలసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీకి చెందిన ప్రముఖ నాయకు లు పుల్లారెడ్డి, చండ్రాయుడు, నాగరాజు, రాము తదితరులతో పాటు 50 కుటుంబాలు టీడీపీలో చేరాయి. బండారు శ్రావణి శ్రీ మాట్లాడుతూ.... వైసీపీ ఐదేళ్ల పాలనలో అభివృద్ధిని పూర్తిగా మరిచిపోయారన్నారు. ధనార్జనే ధ్యేయంగా దోచుకో....దాచుకో అన్న చందంగా వైసీపీ పాలన సాగించారన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముంటిమడుగు శ్రీనివాస్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీలు విశాలాక్షి, గుర్రం ఆదినారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఇల్లూరు రామాంజి, వడ్డేర సామితి జిల్లా అధ్యక్షుడు వన్నూర్, గుత్తాబాలకృష్ణ, సుంకన్న, వడ్లరాము, బాబయ్య, రమణప్ప, మాజీ ఎంపీటీసీ శీనా, ఓభిరెడ్డి, శివశంకర్‌రెడ్డి, సంగప్ప, అంజి, ఆవుల శీనా, సామల మధు, వెంకటేసు, శేఖర్, జగదీష్, ఆశోక్, గంగాధర్, నాగేంద్ర, గుత్తాహరి, చల్లారాజు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa