ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో శుక్రవారం వైసీపీ నేత కోలా ప్రభాకర్ ఆధ్వర్యంలో పలు వైసిపి కుటుంబాలు ఒంగోలు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్ సమక్షంలో టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ ఒక ఛాన్స్ అంటూ జగన్ ప్రజలను మభ్యపెట్టి, ఎన్నికలు గెలిచారని రాజధాని లేని రాష్ట్రంగా మిగిల్చారని మండిపడ్డారు. పార్టీ గెలుపుకు పని చేయాలని చేరిన వారికి దామచర్ల సూచించారు.