ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో రాకెట్ బీడీ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో ఆయన అనుచరులు, పలువురు మైనారిటీ సోదరులు హరిత సమక్షంలో వైసిపి పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. రాయచోటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితమ్మ వారికి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు.