ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయంలో ఒక్క మాట కూడా నిలుపుకోని బీజేపీ పార్టీకి ఓ వైపు చంద్రబాబు, మరోవైపు జగన్ గులాంగిరీ చేస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. బాపట్ల జిల్లా అడ్డాకిలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో షర్మిల ప్రసంగించారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి బీజేపీని గట్టిగా ఎదిరిస్తే జగన్ మోహన్ రెడ్డి తన కొడుకుగా బీజేపీని ముద్దాడని రోజు లేదు. పార్లమెంటులో ఏ బిల్లు ప్రవేశపెట్టినా జగన్ మోహన్ రెడ్డి మాత్రం బీజేపీకి మద్దతిచ్చారని షర్మిల స్పష్టం చేశారు.