ట్రెండింగ్
Epaper    English    தமிழ்

T20WC: రేపే భారత్-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్

sports |  Suryaa Desk  | Published : Sat, Mar 07, 2026, 10:25 AM

టీమిండియా, న్యూజిలాండ్ మధ్య టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్ ఆదివారం నాడు జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే.. 19 ఏళ్ల టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఏ జట్టుకూ సాధ్యం కాని రెండు అరుదైన ఘనతలను అందుకుంటుంది. ఇప్పటివరకు డిఫెండింగ్ ఛాంపియన్ లేదా ఆతిథ్య జట్టు టైటిల్ గెలవలేదు. ఈసారి భారత్ డిఫెండింగ్ ఛాంపియన్, ఆతిథ్య జట్టుగా బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో భారత్ గెలుపుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఇది ఫైనల్ మ్యాచ్ కావడంతో, ఐసీసీ ఎలాగైనా ఫలితాన్ని రాబట్టాలని చూస్తుంది. ఇందుకోసం ఐసీసీ ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే (Reserve Day) కేటాయించింది. మార్చి 8న వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభం కాకపోయినా లేదా మధ్యలో ఆగిపోయినా, మరుసటి రోజు (మార్చి 9) రిజర్వ్ డేన మ్యాచ్ నిర్వహిస్తారు. ఒకవేళ మార్చి 8న మ్యాచ్ ప్రారంభమై వర్షం వల్ల ఆగిపోతే, మార్చి 9న ఎక్కడైతే మ్యాచ్ ఆగిందో అక్కడి నుంచే కొనసాగిస్తారు. అంటే మళ్ళీ మొదటి నుంచి ఆడాల్సిన అవసరం ఉండదు. ఫైనల్ కోసం రెండు రోజుల్లోనూ 120 నిమిషాల అదనపు సమయం అందుబాటులో ఉంటుంది. ఓవర్లు తగ్గించి అయినా మ్యాచ్ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఫలితం తేలాలంటే రెండు జట్లు కనీసం 10 ఓవర్లు ఆడటం తప్పనిసరి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa