ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 04, 2026, 04:55 PM

విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది. విశాఖ, విజయవాడ, గుంతకల్లు డివిజన్లతో పాటు ఒడిశాలోని ఖర్దా రోడ్ డివిజన్ లోని ఏడు స్టేషన్లను విశాఖ డివిజన్ కు బదిలీ చేస్తూ రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి రూ. 106 కోట్లు కేటాయించారు. తాత్కాలికంగా 'ది డెక్' భవనం నుంచి కార్యకలాపాలు సాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. ఈ జోన్ ఏపి అభివృద్ధిలో మైలురాయిగా నిలుస్తుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు.అంతేకాకుండా సుమారు 17 వేల మంది సిబ్బందిని ఈ కొత్త జోన్‌కు కేటాయించే ప్రక్రియను రైల్వే సీనియర్ అధికారుల నియామకాలు తుది దశకు తీసుకువచ్చారని చెబుతున్నారు. దీంతో విజయవాడ, గుంటూరు, గుంతకల్, విశాఖ డివిజన్లతో కూడిన 'సౌత్ కోస్ట్ రైల్వే' దక్షిణ భారత దేశంలోనే అత్యంత కీలకమైన జోన్‌గా అవతరించబోతోందని విశ్లేషిస్తున్నారు. సరుకు రవాణాలో విశాఖ, గంగవరం పోర్టుల అనుసంధానం వల్ల జోన్ ఆదాయాన్ని భారీగా పెంచనుందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మైలురాయిగా నిలవనున్న విశాఖ రైల్వే జోన్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa