ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ముందు పెన్షన్ పంపిణీపై ఎంత హైడ్రామా నడుస్తోందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆదేశాలు పాటించాల్సిందేనని ఎన్నికల కమిషన్.. కుదరదని ఏపీ ప్రభుత్వం చెబుతుండటంతో అసలు పెన్షన్ల కథేంటో తెలియని పరిస్థితి.! అయితే తాజాగా పెన్షన్ల పంపిణీపై బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఇంటింటికీ పెన్షన్ల పంపిణీపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంటింటికీ పంపిణీ కుదరని పక్షంలో.. డీబీటీల రూపంలో చెల్లించాలని సీఎస్‌ను ఈసీ ఆదేశించింది. కాగా.. ఇంటి వద్ద పెన్షన్ల పంపిణీ కుదరదని ఈసీకి తెలిపిన సీఎస్.. ఏప్రిల్‌లో చేసినట్లే చేస్తామని వెల్లడించారు. దీంతో తాజాగా క్లియర్ కట్‌గా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీచేసింది.