రాష్ట్రంలో టీడీపీతోనే సుపరిపాలన సాధ్యమని డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం మండలం లోని అంబాపురం గ్రామంలో సుంకులా పరమేశ్వరి దేవికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. కొమ్మూరి కొట్టాల, హెచ్.కొట్టాల గ్రామాల్లోనూ టీడీపీ నాయకులు ఉన్నం ఎల్ల నాగయ్య, పట్టణ అధ్యక్షురాలు బుగ్గన ప్రసన్నలక్ష్మీ ఆధ్వర్యంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కోట్ల మాట్లాడుతూ..... రాష్ట్రంలో వైసీపీ పాలనలో దళిత, బడుగు, బలహీనవర్గాలపై దౌర్జన్యాలు అధికమయ్యానన్నారు. కార్యక్రమంలో సోమశేఖర్ రెడ్డి, కోట్ల గిరిధర్ రెడ్డి, అంబాపురం సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్, ఆర్.బుక్కాపురం సర్పంచ్ నాగరాజు, జావాజీ వెంకటేశ్వర్లు, మేకల నాగరాజు, రూబెన్, రవీంద్రనాయ్, ముల్లా ఎంఎస్, చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.