కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి హోదాలో మెగా డీఎస్సీ ఫైలు మీదనే చంద్రబాబు తొలి సంతకం చేస్తారని నారా లోకేశ్ తెలిపారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్ను ఇళ్ల వద్దకే తెచ్చిస్తామని చెప్పారు. రూ.4 వేలు పెన్షన్ ఇవ్వడంతో పాటు ఐదేళ్లలో ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. మంగళగిరిలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన లోకేశ్ ఈ మేరకు మాట్లాడారు.