ఓ యువతికి తన లవర్ చెప్పిన ఒక్క సలహా లక్షలను తెచ్చిపెట్టింది. లాటరీ టికెట్ కొనుగోలు చేయాలని ఆమెకు.. లవర్ చెప్పడంతో బలవంతం మీద తీసుకుంది. అయితే రూ.800 పెట్టి కొన్న ఆ లాటరీ టికెట్‌కు ఏకంగా రూ.41 లక్షలకు పైగా జాక్‌పాట్ లభించింది. దీంతో ఆ యువతి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక ఆ లాటరీ టికెట్ కొనుగోలు చేసినా.. దాన్ని చెక్ చేయకుండా అలాగే ఉంచింది. చివరికి లాటరీ తీసిన తర్వాత చెక్ చేసి చూడగా.. తనకే జాక్‌పాట్ తగిలిందని తెలిసి సంతోషంతో ఎగిరి గంతేసింది. ఈ సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది.
అమెరికాలోని మేరీల్యాండ్‌లో నివసించే ఓ యువతిని లాటరీ టికెట్ కొనాలని.. ఆమె ప్రియుడు సూచించాడు. అయితే లాటరీ టికెట్ కొనేందుకు ఆమె నిరాకరించింది. కానీ అతడు ఒత్తిడి చేయడంతో ఏప్రిల్ 20 వ తేదీన లాటరీ డ్రా తీయడానికి ముందు ఎట్టకేలకు ఆ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసింది. లారెల్ పట్టణంలోని వైస్ మార్కెట్స్‌లో 10 డాలర్లు అంటే మన భారత కరెన్సీలో రూ.80 తో క్విక్ పిక్ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఆ లాటరీ టికెట్‌ను తన పర్సులో పెట్టుకుని మర్చిపోయింది. అయితే సోమవారం ఆ
వెంటనే మేరీల్యాండ్ లాటరీ యాప్ ఓపెన్ చేసి.. తన వద్ద ఉన్న టికెట్ నంబర్‌ను ఎంటర్ చేసింది. అప్పుడు ఆ లాటరీలో విజేత తానే అని గుర్తించింది. దీంతో ఆ యువతి ఆనందంతో గట్టిగా అరిచింది. ఆమెకు ఆ లాటరీలో అక్షరాలా 50 వేల డాలర్లు అంటే మన భారత కరెన్సీలో రూ.41,66, 977 గెలుచుకుంది. తనకు అంత ప్రైజ్‌మనీ వస్తుందని అస్సలు ఊహించలేదని ఆ యువతి తెలిపింది. తాను ఏదో సరదాకి.. తన లవర్ చెప్తే ఆ లాటరీ టికెట్ కొనుగోలు చేసినట్లు వివరించింది. తాను గెలుచుకున్న రూ.41 లక్షలతో ఏం చేయాలో అర్థం కావట్లేదని.. అయితే తనకు ఇప్పటికే ఒక ట్రక్కు ఉందని మరో ట్రక్కు కొనుగోలు చేస్తానని వివరించింది.