రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును మళ్లీ ముఖ్యమంత్రిగా చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి గన్ని కృష్ణ తెలిపారు. కాతేరు మండలం కాతేరులో సీనియర్ నాయకులు గంగిన హనుమంతరావు ఆధ్వర్యంలో టీడీపీ-జనసేన-బీజేపీ నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన గన్ని కృష్ణ మాట్లాడుతూ ఒకసారి చేసిన తప్పును మరోసారి చేయకుండా రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వాన్ని ప్రతీఒక్కరూ బలపరచాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో బూత్‌కమిటీ సభ్యులు, ఇన్చార్జులు, క్లస్టర్ ఇన్చార్జిలు, రూరల్ నాయకులు బిక్కిన సాంబ పాల్గొన్నారు.