ఆళ్లగడ్డలో ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి ఎక్కడ? అని ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్ధి భూమా అఖిలప్రియ ప్రశ్నించారు. మండలంలోని చిత్తరేణిపల్లె, ఆలమూరు గ్రామాల్లో ఆదివారం ప్రజాగళం యాత్రలో ఆమె పాల్గొన్నారు. అఖిలప్రియ మాట్లా డుతూ బాలికపై అఘాయిత్యం చేసిన వ్యక్తిపై కేసు పెడితే డీఎస్పీ స్థాయి అధికారిని బదిలీ చేయించిన ఘనత ఆళ్లగడ్డ వైసీపీ నాయకులదేనని విమర్శించారు. పల్లెల్లో అభివృద్ధి జరిగిందంటే అది భూమా కుటుంబం కృషి యేనన్నారు. జనసేన పార్టీ ఆళ్లగడ్డ ఇన్‌చార్జి రాంపు ల్లారెడ్డి మాట్లాడుతూ నంద్యాల పార్లమెంటు టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి, ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థి భూమా అఖిలప్రియను గెలిపించాలని కోరారు. నారాయణ, సత్యనారా యణ, బ్రహ్మయ్య, మాజీ ఎంపీటీసీ ఖాదర్‌హుసేన్, రాజా, ప్రసాద్, సుబ్బా రావు, సంజీవరాయుడు తదితరులు పాల్గొన్నారు.