వాలంటీర్లు కలిసికట్టుగా పనిచేసి వైసీపీ గెలుపుకు కృషి చేయాలని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు అన్నారు. ఎల్ కోట మండలం భీమాలిలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను, ప్రభుత్వంలో జరిగిన మంచిని వాలంటీర్లు ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. ప్రతి వారంటీర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కోరారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా ఝాన్సీ ని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.