చంద్రబాబు ఫ్రస్టేషన్‌లో మతి బ్రమించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు వైవీ సుబ్బారెడ్డి. బాబు, పవన్ సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడుతున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయమని ఎన్డీఏ ప్రభుత్వమే చెప్పిందని గుర్తుచేశారు. హక్కు దారులకు మేలు చేయడానికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు భూములు ఇచ్చేవాడే కాని లాక్కునే వాడు కాదని, అందుకే 31లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని తెలిపారు.అమరావతి పేరుతో చంద్రబాబు భూములు లాక్కున్నారు. పేదలు ఎవరూ వీరి తప్పుడు ప్రచారన్ని నమ్మద్దు. పింఛన్లను అడ్డుకొని లబ్ధిదారుల మరణానికి కారణం అయ్యారు. కూటమిలో చేరిన తరువాత బీజేపీ తీరులో మార్పు వచ్చింది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పాలనపై కేంద్రం ఆధీనంలో ఉండే నీతి అయోగ్ ప్రశంసించింది. చంద్రబాబు, పవన్ ఇచ్చిన స్క్రిప్ట్ మోీదీ చదివారు. పోలవరంను ఏటీఏంలా వాడుకున్నారని నాడు మోదీ అన్నారు. పోలవరం ఆలస్యానికి చంద్రబాబే కారణం. పోలవరం నిర్మాణం పూర్తి చేస్తాం. బాబు విడుదల చేసిన మేనిఫెస్టోలో భాగస్వామ్యం ఉందని బీజేపీ ఎందుకు చెప్పలేకపోతుంది.? స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం వైయస్ఆర్‌సీపీ కట్టుబడి ఉంది. ప్రధాని మాట్లాడలేదు సరే.. బాబు అయినా తన స్టాండ్ చెప్పాలి’ అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa