టీడీపీ ఎన్ని కుయుక్తులు చేసినా ప్రజలు వైయస్ జగన్‌ని పెద్ద ఎత్తున ఆశీర్వదించారని, రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాను గాలి బ్రహ్మాండంగా వీచిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రల్లో వైయస్ జగన్ చేసిన సంక్షేమాలు, దాన్నే కొనసాగిస్తానన్న వైయస్ జగన్ మాటలకు ప్రజలు మద్దతు పలికారని చెప్పారు. వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలో సంక్షేమం ద్వారా లబ్ధిపొందిన మహిళలు 74 శాతం ఉన్నారని, వారంతా నా అన్న, తమ్ముడు మా ఆత్మగౌరవాన్ని కాపాడారని ఓటు వేయడానికి వెల్లువెత్తారన్నారు. మరీ ముఖ్యంగా వృద్ధులు తమ గౌరవాన్ని తమ బిడ్డ వైయస్ జగన్ పెంచారని ఉదయాన్నే వచ్చి ఆశీర్వదించారన్నారు. టీడీపీ ఎన్నో కుతంత్రాలు పన్నింది. ఎన్నో అబద్ధాలు చెప్పిందని, సడన్‌గా లేని చట్టాన్ని ల్యాండ్ యాక్ట్‌ను తీసుకొచ్చి రైతులను మభ్య పెట్టాలని చూశారు. కానీ రైతులు నమ్మలేదన్నారు.