ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు పెద్ద సమస్య వచ్చిపడింది. క్యాట్ తీర్పు ఇచ్చినా ఆయనకు పోస్టింగ్ దక్కలేదు..క్యాట్ తీర్పు ఇచ్చి పది రోజులు గడుస్తున్నా, ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసినా స్పందన లేదని చెబుతున్నారు. మరో రెండు వారాల్లో ఆయన పదవీకాలం పూర్తి కాబోతోంది.. దీంతో ఏబీ వెంకటేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏబీవీ సస్పెన్షన్‌ను ఎత్తేస్తూ క్యాట్ ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం ఏపీ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు వెకేషన్ బెంచ్‌లో సీఎస్ జవహర్‌రెడ్డి గురువారం పిటిషన్ దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ అనుమతి లభించకపోవడంతో ఆ పిటిషన్ ఇప్పటి వరకు అడ్మిట్ కాలేదు.
ఈ నెల 8న హైదరాబాద్‌లోని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ చెల్లదంటూ తీర్పు వెల్లడించిన సంగతి తెలిసందే. ఆ తీర్పుకు సంబంధించిన పేపర్లు మూడు రోజుల తర్వాత బయటకు వచ్చాయి. ఆ వెంటనే ఏబీవ వెంకటేశ్వరరావు సీఎస్ జవహర్ రెడ్డిని కలిసి ఆ తీర్పు ప్రతుల్ని అందజేశారు. తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు.. ఈ మేరకు దరఖాస్తును కూడా అందజేశారు. వారం క్రితం సీఎస్‌ను కలిసినట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈసీ దగ్గర అనుమతి పొందిన తర్వాత ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు ఈలోగా ఏబీవీపై ప్రాసిక్యూషన్‌కు కేంద్రం నుంచి అనుమతి వచ్చిన సంగతి తెలిసిందే.
ఏబీ వెంకంటేశ్వరరావు 2019 ఎన్నికల తర్వాత ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ లేకుండా పోయింది. ఆయన్ను రెండుసార్లు సస్పెండ్ చేసింది ప్రభుత్వం. క్యాట్‌ను ఆశ్రయించిన తర్వా త తీర్పు అనుకూలంగా వచ్చింది. అయినా సరే ఆయనకు మాత్రం పోస్టింగ్ మాత్రం దక్కలేదు. రెండువారాల సర్వీస్ మాత్రమే ఉండటంతో ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 31తో సర్వీస్ పూర్తి కానుండటంతో ఏబీ వెంకటేశ్వరరావుకు ఈలోపు పోస్టింగ్ వస్తుందా లేదా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.