ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆటో డ్రైవర్ కి కారు డ్రైవర్‌కు ఘర్షణ, పలువురికి గాయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 20, 2024, 03:21 PM

ఆటో డ్రైవర్ హారన్ కొట్టడం కారు డ్రైవర్‌కు ఇబ్బందికరంగా అనిపించింది. అంతే.. కారు డ్రైవర్‌తో పాటు కారులో ఉన్న అతని బంధువులు పెద్ద గలాటే సృష్టించారు. నరసాపురం మండలం తూర్పు తాళ్ళు గ్రామంలో ఆటో డ్రైవర్, కారు యజమాని మధ్య హారన్ వివాదం తలెత్తింది. డ్రైవర్‌తో పాటు ఆటోలో ఉన్న ప్రయాణికులను కారు యజమాని , అతని బంధువులు చితక బాదారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాల బంధువుల రాకతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa