రాష్ట్రవ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. 301 సమస్యాత్మాక ప్రాంతాలను గుర్తించి సోదాల నిర్వహించినట్లు తెలిపారు. సోదాల్లో ఎలాంటి పత్రాలు లేని 1104 వాహనాలు జప్తు చేసినట్లు చెప్పారు. 482 లీటర్ల నాటుసారా, 33.32 లీటర్ల మధ్యం, 436 లీటర్ల నాన్ డ్యూటి లిక్కర్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాల్లో నమోదైన కేసుల్లో 1522 మందిని గుర్తించామన్నారు.కొంత మందికి 41 సీఆర్ పీసీ కింద నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు. ఎన్నికల రోజు నమోదైన కేసుల్లో 2790 మందిని గుర్తించి పలువురిని అరెస్టు చేశామన్నారు. ఎన్నికల అనంతరం నమోదైన కేసుల్లో 356 మందిని గుర్తించి పలువురిని అరెస్టు చేశామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేసుల్లో గుర్తించిన 85 మంది ముద్దాయిలపై హిస్టరీ షీట్లు ఓపెన్ చేశామన్నారు. ముగ్గురిపై పీడీయాక్ట్, మరో ఇద్దరిని బహిష్కరించేందుకు సీఫార్స్ చేశామని డీజీపీ తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు గుర్తిస్తే 112,100 కు డయల్ చేసి వివరాలు తెలిపితే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పేర్కొన్నారు.