శ్రీకాకుళం జిల్లా, సిక్కోలులోని పలు ప్రాంతాల్లో పోలీసులు మంగళవారం కార్డెన్‌సెర్చ్ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు గడువు సమీపిస్తున్న వేళ.. గ్రామాల్లో శాంతియుత వాతావరణ నెలకొనేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ రాధిక ఆదేశించారు. ఈ మేరకు పోలీసులు సమస్యాత్మక గ్రామాల్లో పికెట్లు, పెట్రోలింగ్ నిర్వహించి ఘర్షణలు, అల్లర్లు చోటుచేసుకోకుండా ప్రజలకు అవగాహన కల్పించారు. రోజూ గ్రామాల్లో కార్డెన్‌సెర్చ్ నిర్వహించి.. అనధికార వాహనాలు, మద్యం, బాణసంచా సామగ్రి నిల్వలపై సోదాలు చేస్తున్నారు. ఇళ్లలోను, గడ్డికుప్పలను.. పాడుబడిన షెడ్లను.. అనుమానంకలిగే ప్రతి ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు. అరటి, మామిడి తోటలను సైతం గాలిస్తున్నారు. చెక్‌పోస్టులు, ముఖ్య కూడళ్లలో విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టి అక్రమ రవాణా నివారణకు చర్యలు చేపడుతున్నారు. అలాగే లూజు పెట్రోలు విక్రయించకుండా బంకుల యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు.