ఉరవకొండ మండలం పెన్నహోబిలం శ్రీ లక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పై బుధవారం అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న అరా తీశారు. రథోత్సవానికి భక్తులు భారీగా తరలి వస్తున్న నేపథ్యంతో పాటు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని ఈఓ విజయ్ కుమార్ కు సూచించారు. అనంతరం శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు పట్టువస్త్రాలతో సన్మానించారు.