తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన బుధవారం రాత్రి గోవిందరాజస్వామివారు చంద్రప్రభ వాహనంపై దర్భార్ కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది. ఔషధీశుడైన చంద్రుడు మనకు పోషకుడే. ఆ ఔషధులు లేకపోతే జీవనం లేదు. చంద్రుని వల్ల ఆనందం, చల్లదనం కలుగుతుంది. అందుకే స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఆహ్లాదపరుస్తాడు.