ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తుపానుగా మారనున్న వాయుగుండం.. తీరంవైపు దూసుకొస్తున్న రెమాల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 24, 2024, 07:06 PM

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరో 24 గంటల్లో తుపానుగా మారుతుందని.. వాతావరణశాఖ ప్రకటించింది. ఈ తుపానుకు రేమాల్ అని నామకరణం చేశారు. అయితే ఈ తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద ఉండదని.. విశాఖపట్నం వాతావరణశాఖ అధికారి సునంద తెలిపారు. రేమాల్ తుపాను ఈశాన్య దిశగా పయనించి.. మే 27వ తేదీ అర్ధరాత్రి బంగ్లాదేశ్ వద్ద తీరం దాటుతుందని అంచనా వేశారు. ఈ తుపాను ప్రభావం బంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్ మీద ఉంటుందని.. ఏపీ మీద తుపాను ప్రభావం ఉండదని.. విశాఖపట్నం వాతావరణశాఖ అధికారి సునంద తెలిపారు.


రేమాల్ తుపాను ప్రభావం ఒడిశా, బంగాల్‌, బంగ్లాదేశ్‌పై ఉంటుందని విశాఖపట్నం వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తుపాను తీరందాటే సమయంలో భారీ వర్షాలతోపాటు గంటకు 102 కి.మీ.వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు. తుపాను ప్రభావం ఏపీపైనా లేనప్పటికీ.. సముద్రం ఆటుపోట్లకు లోనయ్యే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ చేపలవేటకు వెళ్లవద్దని సూచించారు. ఇది దృష్టిలో ఉంచుకుని అన్ని పోర్టుల వద్ద ప్రమాదహెచ్చరికలు జారీచేసినట్లు తెలిపారు.


రేమాల్ తుపాను ప్రభావం ఏపీపైనా లేని కారణంగా.. రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నట్లు చెప్పారు. దీంతో వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందన్నారు. మరోవైపు వాయుగుండం ప్రభావంతో రెండు రోజులపాటు ఏపీవ్యాప్తంగా అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. శని, ఆదివారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com