శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంట పురం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద శనివారం బీసీజి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వైద్య సిబ్బంది నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జయవర్ధన్ సిబ్బంది కలిసి సిడబ్ల్యూసి మెంబర్ రఘువీరారెడ్డికు బీసీజీ వ్యాక్సిన్ వేశారు. హెల్త్ కి సంబంధించి పదో సలహాలు సూచనలు వైద్యులు అందించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.