ఒంటిమిట్ట మండల పరిధిలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఒంటిమిట్ట మండలం ఎంపీడీవో ఒక ప్రకటనలో సోమవారం తెలిపారు. మండల పరిధిలోని సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరు కావాలని వారు కోరారు. తమ నివేదికలను ఎంపీడీవో కార్యాలయంలో సమర్పించాలన్నారు. అందరూ తప్పనిసరిగా హాజరై సర్వసభ్య సమావేశాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.