ఎమ్మిగనూరు మండలం రాళ్ల దొడ్డి గ్రామ సరి హద్దులలో కారు బోల్తా పడింది. ఆదివారం రాళ్ల దొడ్డి గ్రామ పొలిమేరలో బాట మారెమ్మ దేవాలయం సమీపంలో ప్రమాదం జరిగింది. కర్నూలు జిల్లాకు చెందిన కొందరు భక్తులు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళుతున్నారు. మార్గ మధ్యలో కారు అదుపు తప్పి ప్రక్కనే ఉన్న పొలాల్లో పల్టీ కొట్టుకొంటూ పడింది. అందులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఏలాంటి ప్రాణాపాయం జరగలేదు.