భార్యను భర్త హత్యచేసిన సంఘటన హిందూపురంలో చోటుచేసుకుంది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు సూగూరులో నివాసముండే ఓబులేసుకు నాలుగేళ్ల క్రితం ఉప్పర అనూషకు ఇచ్చి వివాహం జరిపించారు. వీరి దాంపత్య జీవనం సాఫీగా సాగింది. భర్త ఓబులేసు తాగుడుకు బానిసయ్యాడు. దీంతో తరచూ భార్యను వేదించేవాడు. ఈ క్రమంలో ఆదివారం భార్యను హత్య చేశాడు. నీపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.