కందుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న డాక్టర్లకు షోకాజ్ నోటీసులను అందించడానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు సిద్ధం చేసింది. పట్టణంలో పేద ప్రజలకు అందుబాటులో వైద్యం అందించాలనే సంకల్పంతో వైద్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే డాక్టర్లు సక్రమంగా విధులకు హాజరుకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనివలన వైద్య అవసరాల కోసం విచ్చేసినటువంటి రోగులు అనేక ఇబ్బందులు పాలు అవుతున్నారు.