కంభం మండలం తురిమెళ్ళ గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం జరుగుతున్న ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని కంభం ఎస్సై రాజేష్ వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు జరుగుతాయని పరీక్ష నిర్వహణ అధికారులు వెల్లడించారు. ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా పోలీసు భద్రత ఏర్పాటు చేశామన్నారు.