పెనుకొండ నియోజకవర్గం గొరంట్ల మండలంలోని రైతు భరోసా కేంద్రాల్లో వేరుశనగ కాయలు బుధవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎంపీడీఓ. వ్యవసాయ అధికారి , సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిదంగా మండల పరిధిలోని అన్ని రైతు భరోసా కేంద్రాల్లో పంపిణీ చేయడం జరిగింది. మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ మండల పరిధిలో బుధవారం రోజు 670 క్వింటలు కు గాను 770 మంది రైతులు వేరుశనగ కాయలు పంపిణీ చేశామని తెలిపారు.