ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అందరూ అలర్ట్‌గా ఉండాలని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. కౌంటింగ్ రోజు అనుసరించాల్సిన విధానాలపై ఇవాళ జూమ్ లో కౌంటింగ్ 175 నియోజక వర్గాల కౌంటింగ్ ఏజెంట్లు, పార్టీ నేతలకు సజ్జల రామకృష్ణ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు అడ్డదారిలో పట్టు నిలుపుకోవాలి అనుకుంటున్నారు. ఈసీ, ఎన్డీయే కూటమి ఏ విధంగా అన్యాయంగా వ్యవహరిస్తుందో అందరికీ తెలుసు అన్నారు. ప్రజా తీర్పు వైయస్ఆర్‌సీపీకి అనుకుంలాగా ఉంది.. పోస్టల్ బ్యాలెట్ విషయంలో గందరగోళానికి గురి చేస్తున్నారు జాగ్రత్తగా చూడాలి అని సూచించారు. వైయస్ఆర్‌సీపీకి పడిన ప్రతి ఒక్క ఓటు మన పార్టీకే చెందాలి.. చెల్లని ఓటు చెల్లదని గట్టిగా చెప్పాలి అని పేర్కొన్నారు. అవతల పార్టీలు నిబంధలను అతిక్రమిస్తే గట్టిగ నిలదీయాలన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నియమాలను ఫాలో అవ్వాలి అని సజ్జల రామకృష్ణ రెడ్డి తెలిపారు. అవసరం అయితే అవతల వాళ్ళని క్వశ్చన్ చేసి ఫిర్యాదు చేయాడానికి అయినా సిద్ధంగా ఉండాలని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి తెలిపారు. అన్ని అంశాలపై పూర్తి అవగాహనతో కౌంటింగ్ ఏజెంట్లు ఉండాలి.. తెలియని విషయాలు స్పష్టంగా తెలుసుకోవాలి.. ఇప్పటి వరకు ఎంత సీరియస్ గా ఉన్నామో.. కౌంటింగ్ రోజు అంత కన్నా సీరియస్ గా.. అలర్ట్ గా ఉండాలి అందరు.. అవతల ఏజెంట్స్ కానీ, అధికారులు కానీ నియమాలని అతిక్రమిస్తే వైయస్ జగన్ తరుపున గట్టిగా మాట్లాడండి.. కౌంటింగ్ అయ్యాక పోస్ట్ మార్టం చేసే విధంగా కాకుండా ముందే జాగ్రత్తగా ఉండాలని సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు.