ప్రజాపరిపాలనకు సీఎం వైయస్ జగన్ నాంది పలికి నేటికి సరిగ్గా ఐదేళ్లు. గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు.. 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైయస్ఆర్‌సీపీ చారిత్రక విజయం సాధించింది. కేవలం 23 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలకు పరిమితమైన టీడీపీ ఘోర పరాజయం పాలైంది. వైయస్ఆర్‌సీపీ అఖండ విజయం సాధించడంతో 2019, మే 30న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంచేసి.. ప్రజాపరిపాలనకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతం అధికారం చేపట్టిన తొలి ఏడాదే అమలుచేశారు. మొత్తమ్మీద 99 శాతం హామీలు అమలుచేసి మేనిఫెస్టోకు సరికొత్త నిర్వచనం ఇచ్చారు.