ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురు, శుక్రవారాలు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారిణి సునంద పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ నిన్న ఒంగోలులో 43 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అయిందని, విశాఖలో అత్యధికంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమలో కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నారు.నైరుతి రుతుపవనాలు కేరళ, సౌత్ తమిళనాడుకు తాకాయని, జూన్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్‌కు నైతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని సునంద పేర్కొన్నారు. అంతవరకూ వరకు ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. రుతుపవనాలు ఏపీకి తాకిన తర్వాత విస్తారంగా వర్షాలు పడతాయని సునంద తెలిపారు.