బనగానపల్లె నియోజకవర్గ జనం బీసీ జనార్దన్‌రెడ్డికే జై కొట్టారు. నవాబు కోటలో బీసీ జనార్దన్‌రెడ్డి పాగా వేశారు. మంగళవారం బనగానపల్లె అసెంబ్లీ నియోజకవర్గంలో పోలైన ఓట్లను నం ద్యాల శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాలలో లెక్కించారు. బనగానపల్లె నియోజకవర్గంలో 2,41,179 ఓట్లు ఉండగా 2,03,575 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 84.41 పోలింగ్ శాతం నమోదైంది. ఇందులో 1,00,4 32 మంది పురుషులు కాగా 1,03,138 మంది మహిళలు, ఇతరులు ఐదుగురు ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఫలితాల్లో సుమారు 25,566 వేల ఓట్లకు పైగా భారీ మెజార్టీతో టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్‌రెడ్డి గెలుపొం దారు. పోలింగ్ రోజు నుంచి కౌంటింగ్ వరకు బనగానపల్లె ఫలితంపై జిల్లా మొత్తం ఆసక్తిగా ఎదురు చూసింది. మొత్తం 2024 ఎన్నికల్లో బీసీ జనార్దన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిపై 27వేలకు పైగా ఘన విజయం సాధించారు. బీసీని బనగానపల్లె నియోజకవర్గం ప్రజలు రెండోసారి ఎమ్మె ల్యేగా అవకాశం ఇచ్చారు. 2009లో ఘన విజయం సాధించిన బీసీ జనార్దన్ రెడ్డి 2014లో ఓటమి చెందారు. ప్రస్తుతం భారీ మెజార్టీతో గెలుపొందారు. బనగానపల్లె, అవుకు, కొలిమిగుండ్ల, సంజామల, కోవెలకుంట్ల మండలాల్లో మెజార్టీ సాధించి వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిని ఓడించి విజయ బావుటా ఎగురవేశారు. జిల్లాలోనే బనగానపల్లె నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షించింది. గత 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే బీసీ 17,361 ఓట్లతో వైసీపీ కాటసాని రామిరెడ్డిపై గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కాటసాని రామిరెడ్డిపై గెలిచి సత్తాచాటారు. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న బనగానపల్లె నియోజకవర్గంలో రెండోసారి బీసీని గెలిపించి తెలుగు తమ్ముళ్లు భారీ మెజార్టీతో గెలిపించారు. కేవలం మొదటి రౌండు, 23 వ రౌండ్లలో మాత్రమే మెజార్టీ సాధించింది. మొదటి రౌండ్‌లో 11 88 ఓట్లు, 23వ రౌండ్‌లో 77 ఓట్లు మెజార్టీ వైసీపీ మెజార్టీ సాధించారు. మొత్తం 24 రౌండ్లలో 24 రౌండ్లలో బీసీ మెజార్టీ సాఽధించి పట్టు నిలుపుకున్నారు.